GNTR: తెనాలి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పట్టణాన్ని రాష్ట్రంలో టాప్-5 స్థానంలో నిలిపేలా కార్యాచరణ రూపొందించాలని, పన్నుల వసూళ్లు 95 శాతం సాధించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రూ.9 కోట్ల నిధులను త్వరితగతిన రాబట్టాలని సూచించారు.