AKP: రెల్లి కార్పొరేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు మంగళవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వినతిపత్రం అందజేశారు. రెల్లిలకు కార్పొరేషన్ లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను స్పీకర్‌కు వివరించారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పీకర్ తెలిపారు.