MBNR: గండీడ్ మండలం వెన్నచేడులో శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. మార్చి 26 నుంచి 29 వరకు జరిగే ఉత్సవాల్లో సీతారాముల కళ్యాణం, రథోత్సవం, అగ్నిగుండం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.