KNR: శంకరపట్నం మండల ప్రజలు తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు ఈనెల 28న హుజూరాబాద్ కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై శేఖర్ రెడ్డి సూచించారు. కోర్టుల్లో రాజీపడదగ్గ చిన్నపాటి కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన ముగించుకోవచ్చని తెలిపారు. “రాజీ మార్గమే రాజమార్గం” అని అన్నారు