TG: HYDలోని గన్‌పార్క్ దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి KTR తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని మండిపడ్డారు. ఎన్నికలున్న రాష్ట్రాలకే గ్యాస్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.