TG: జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కలిశారు. ఈ సందర్బంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అనుభవం ఉన్న నేత జీవన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం మంత్రి శ్రీధర్ బాబు కూడా కలిశారని, పార్టీ వీడొద్దని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని వదులుకోదల్చుకోలేదని, పునరాలోచన చేయాలని కోరామన్నారు.