WG: జిల్లాలో హోటల్ యజమానులు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నారు. ఒకపక్క కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడగా, మరోపక్క ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు వారిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఆదివారం రూ. 340గా ఉన్న కిలో చికెన్ ధర, ఒక్కసారిగా రూ. 400 దాటడంతో నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.