రాజస్థాన్ బలోత్రా జిల్లా మాల్వా గోయ్లాన్ గ్రామానికి చెందిన మహేంద్ర మేఘవాల్(23)కు నాలుగేళ్ల క్రితం అనుదేవి(23)తో వివాహమైంది. అయితే, భార్య అనుదేవికి పెళ్లికి ముందే ప్రియుడు అమ్రారామ్ ఉన్నాడు. ఈనెల 20న మహేంద్ర, అనుదేవికి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న అనుదేవి అర్ధరాత్రి అమ్రారామ్ను ఇంటికి పిలిపించింది. మహేంద్ర గాఢ నిద్రలో ఉండగా ఇద్దరూ కలిసి అతన్ని గొంతు నులిమి చంపేశారు.