KDP: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు ఉండగా, కొత్తగా మరో MP స్థానం పెరిగే అవకాశం ఉంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.