MNCL: టీకాలు పశువులను వివిధ వ్యాధుల నుంచి కాపాడతాయని జన్నారం మండలంలోని కామన్పల్లి గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, ఉప సర్పంచ్ తేజావత్ భరత్ అన్నారు. మంగళవారం కామన్పల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గాలికుంటు వ్యాధి నివారణ శిబిరంలో వారు పాల్గొన్నారు. రైతులు వారి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించారు.