అన్నమయ్య: కడప-రేణిగుంట హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప నుంచి రైల్వేకోడూరుకు మద్యం లోడ్‌తో ఓ మినీ లారీ బయలుదేరి నందలూరు మండలంలోని ఆల్విన్ కర్మాగారం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. మద్యం బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే వాటిని మరో వాహనంలోకి మార్చి తరలించారు.