KRNL: గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో ఇవాళ ట్రాక్టర్ ప్రమాదంలో సాదిక్ బాషా (19) అనే యువకుడు మృతి చెందాడు. బావి తవ్వకాల్లో భాగంగా మట్టిని తరలిస్తుండగా, ట్రాక్టర్ ట్రాలీకి అనుసంధానమైన ఇనుప రాడ్ విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. ట్రాక్టర్ నుంచి దూకే సమయంలో తలకు గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.