AP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించారు.