W.G: ఆకివీడు మండలంలోని పేకాట స్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించి 9 మందిని అరెస్టు చేశారు. దుంపగడపలో ఐదుగురిని అరెస్టు చేసి రూ.7,800, సిద్దాపురం శివారులో నలుగురిని పట్టుకుని రూ.6,200 స్వాధీనం చేసుకున్నట్లు SI హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి, వారిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు వివరించారు.