VKB: వికారాబాద్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఉదయం నుంచి అన్ని టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెరిచి ఉన్న ఒకటో రెండో హోటళ్లలో కేవలం ఇడ్లీ, దోశలు మాత్రమే లభించాయి. నూనె (ఆయిల్) కొరత కారణంగా పూరీ, బోండాలు వేయడం లేదని యజమానులు చెప్పడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.