E.G: రాజమహేంద్రవరం నగరంలోని లాస్పిన్ హోటల్లో బస చేసిన రాష్ట్ర బీ.సీ. సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను ఏపీ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర నాయకులు జయరాజు, ఆర్ఎస్ఎన్ మూర్తి జిల్లా ప్రతినిధులు మంత్రితో సమావేశమై ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.