MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 1245 మంది భక్తులు హనుమాన్ దీక్ష మాలాధారణ చేశారు. సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వేద పండితుల సమక్షంలో హనుమాన్ దీక్ష మాలధారణను స్వీకరించారు. కాగా, మంగళవారం ఉదయం 10 గంటలకు దేవాలయం మండపంలో హుండీల లెక్కింపు కార్యక్రమం ఉందని ఈవో శ్రీనివాస్ వెల్లడించారు.