VKB: తాండూరు బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతతో వృద్ధులు, విద్యార్థులు బస్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచి, ప్రయాణికుల కష్టాలను తీర్చాలని స్థానికులు కోరారు.