ఫ్రిడ్జ్ ఒక విద్యుత్ పరికరం కాబట్టి, అగ్ని మూల అయిన ఆగ్నేయ దిశ దీనికి అత్యంత ఉత్తమమైన స్థానం. ఒక వేళ వంటగదిలో స్థలం తక్కువగా ఉంటే, నైరుతి మూలలో కూడా ఉంచుకోవచ్చు. ఈ దిశలో బరువైన ఉపకరణాలు ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈశాన్యం, ఉత్తర, లేదా తూర్పు దిశల్లో ఫ్రిడ్జ్ అస్సలు ఉంచరాదని హెచ్చరిస్తున్నారు.