రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జిల్లాలో విషాదం నెలకొంది. వివాహం జరగాల్సిన రోజే అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాబాయ్‌ల ఒత్తిడితో జరిగిన బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే వారు మరణించినట్లు మేనమామ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.