HNK: తెలంగాణలో 60% జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, 2026-27 బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ అన్నారు. హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా అమలు చేస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అన్నారు.