W.G: భీమవరం కలెక్టరేట్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.