TG: ముస్లింలకు మాజీ సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారన్నారు. రంజాన్ సందర్భంగా శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమ పరిమళిస్తాయన్నారు. ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. గంగా-జమున తహజీబ్ కు ప్రతీకగా తాము పరిపాలన చేశామన్నారు.