HYD: హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో వరల్డ్ ఫారెస్ట్ డే సందర్భంగా మార్చి 21న ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు బర్డ్ వాక్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని స్పష్టం చేశారు. ప్రకృతి ప్రేమికులు, పక్షులపై ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.