కోనసీమ: అల్లవరం మండలం ఓడల రేవు బీచ్లో మిత్రులతో కలిసి సముద్రంలో స్నానానికి దిగిన దొమ్మేటి లోకేశ్(16) శుక్రవారం గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుడు అమలాపురం నారాయణపేటకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.