KNR: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ముస్లింలు భారీగా తరలివచ్చి ప్రత్యేక నమాజ్ చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దల ఆధ్వర్యంలో ఖురాన్ పఠనం చేస్తూ లోక కల్యాణం కోసం ప్రార్థనలు నిర్వహించారు.