GNTR: పొన్నూరు పట్టణంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సహకారంతో ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కబరస్థాన్, ఇటికంపాడు రోడ్ ఈద్గా వద్ద నమాజ్‌కు వచ్చిన వారికి మజ్జిగ అందజేశారు. రంజాన్ సోదరభావం, సేవా భావాన్ని పెంపొందించే పండుగ అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.