MDK: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడు గన్పూర్ ఐఎంఎల్ డిపోలో విధులు నిర్వహించే నాగం నగేష్గా గుర్తించారు.