»Bigg Boss Rathika Private Photos Leaked Rahul Sipliganj Fire
Bigg Boss Rathika ప్రైవేట్ ఫోటోలు లీక్.. రాహుల్ సిప్లిగంజ్ ఫైర్
ఈసారి బిగ్ బాస్ హౌజ్ ఫుల్లుగా ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. అన్ని సీజన్స్‌లో సీజన్ 7 చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంటున్నారు. ఈ సీజన్లో రతికా పేరు మార్మోగిపోతోంది. తాజాగా ఈమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయని ఫైర్ అయ్యాడు.
Bigg Boss Rathika Private Photos Leaked.. Rahul Sipliganj Fire
Bigg Boss Rathika: బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లలో రతికా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. రైతు బిడ్డతో ఆమె చేసే రచ్చ.. మిగతా వాళ్లతో చేసే లొల్లి మామూలుగా ఉండటం లేదు. ముఖ్యంగా ఆమె క్యూట్‌నెస్‌తో ఆడియెన్స్‌ను ఫిదా చేస్తోంది. అయితే ఈ బ్యూటీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు ఇది ప్రచారం అని చెబుతున్నా.. వాళ్లిద్దరు క్లోజ్‌గా ఉన్న కొన్ని పర్సనల్ ఫోటోలు బయటికి రావడంతో ఇద్దరు ఎక్స్ అనే క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ రతిక పేరు చెప్పకుండా ఇండైరెక్ట్‌గా షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.
ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటి వరకు?
ఫేమ్ కోసం వేరే వాళ్ల కష్టాన్ని అవసరానికి కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. ఎప్పుడూ పక్క వారి పేరు, టాలెంట్ మీద బతకాలని చూస్తుంటారని అన్నారు. నీ లోపల ఉన్న మరో మనిషికి ఆల్ ది బెస్ట్. నీ దగ్గర డబ్బులు తీసుకుని పబ్లిసిటీ చేస్తున్న వారికి కూడా కంగ్రాట్స్ అని రాసుకొచ్చాడు. నాదొక ఒక ప్రశ్న? అసలు ఆరేళ్ల తర్వాత ఒకరి ఫోన్లో ఉన్న పర్సనల్ ఫొటోలు ఒక్కసారిగా ఎలా బయటకు వచ్చాయి? అంటే ఇది వాళ్లు హౌజ్ లోపలికి వెళ్లే ముందే పక్కాగా ప్లాన్ చేసుకున్నారని అర్ధమైపోతుంది.. అంటూ రాహుల్ ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యాడు.
ఫైనల్‌గా తాను ఏ ఒక్కరి జీవితాలతో ఆడుకోలేదు.. సక్సెస్ కోసం ఎవరి కష్టాలు వాళ్లు పడుతుంటారని అన్నారు. ఇలాంటి పని చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సింది.. ప్రతీ ఒక్కరికీ గతం అనేది ఉంటది.. ఏం తెలియకుండా మీరు జడ్జ్ చేయకండి.. నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి థాంక్స్.. నెగిటివ్ స్ప్రెడ్ చేయాలనుకునే వారికి ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. మొత్తంగా రతిక పేరు చెప్పకపోయినా.. ఆమె గురించే రాహుల్ మాట్లాడని అంతా అంటున్నారు.