భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే రూ.102 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిందని Sacnilk తెలిపింది. ప్రీమియర్స్తో కలుపుకొని రూ.145 కోట్లు(రూ.172 కోట్ల గ్రాస్) రాబట్టిందని వెల్లడించింది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు పడినట్లు చెప్పింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.