TG: పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించడంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్‌తో పోటీ పడుతోందని ప్రశంసించారు.