TG: ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో సినీ అవార్డులను నిర్వహించడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ ఒక వ్యక్తి కాదు, తెలంగాణ ఆత్మను ప్రపంచానికి చాటిన గొప్ప వ్యవస్థ అని కొనియాడారు. సామాజిక మార్పు కోసం జీవితాన్ని ధారపోసిన ఆయనకు ఈ అవార్డులు అంకితమని తెలిపారు. కళాకారులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు.