రీసెంట్గా పుష్ప సినిమాకు గాను 69వ నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ సొంతం చేసుకున్నాడు అల్లు అఅర్జున్. ట్రిపుల్ ఆర్ సినిమాకు గాను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రేసులో ఉన్నప్పటికీ బన్నీ అవార్డ్ కొట్టేశాడు. సైమా అవార్డ్స్‌లో మాత్రం ఎన్టీఆర్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చినట్టు తెలుస్తోంది.
SIIMA Awards: ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఎంత వేడిగా ఉందో చూస్తునే ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్పాట్ నుంచే విజయవాడకు వెళ్లి మళ్లీ షూటింగ్ చేసి.. మళ్లీ జైల్లో బాబును కలిసి టీడిపితో పొత్తు ప్రకటించాడు. ఇలాంటి సమయంలో నందమూరీ హీరో జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నాడు. ఒక్కసారిగా కూడా స్పందించలేదు. కానీ ఉన్నట్టుండి ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలితో కలిసి ప్రత్యక్షం అయ్యాడు యంగ్ టైగర్. ఎందుకు, ఏమిటి అనేది చెప్పకుండా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశాడు. అయితే దేవర షూటింగ్‌తో పాటు బాబు ఇష్యూని పట్టించుకోకుండా ఉన్నట్టుండి తారక్ దుబాయ్ ఎందుకు వెళ్లాడనేది హాట్ టాపిక్‌గా మారింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఎన్టీఆర్ దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డ్స్ వేడుకకు వెళ్లినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 15, 16న జరగనున్న సైమా ఈవెంట్ కోసమే ఎన్టీఆర్ ఫ్యామిలితో కలిసి వెళ్లినట్టు సమాచారం. దేవర షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి మరీ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడు అంటే.. బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకోని ఉంటాడు.. అనే టాక్ ఊపందుకుంది. ఈ అవార్డ్ రేసులో రామ్ చరణ్, నిఖిల్, అడవి శేష్, దుల్కర్ సల్మాన్‌లు బెస్ట్ యాక్టర్ కేటగిరిలో పోటీ పడుతున్నారు. ఈ అవార్డ్ ఎన్టీఆర్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో జనతా గ్యారేజ్ సినిమాకి గాను తెలుగు కేటగిరిలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మళ్లీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని కొమురం భీమ్ పాత్రలో చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని ఎన్టీఆర్ గెలుచుకున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.