BDK: సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్కి సమస్యలతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు వై రాంగోపాల్ మాట్లాడుతూ.. చాలిచాలని వేతనాలతో పిల్లల చదువులకు కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.