HYD: నీరా ప్రాసెసింగ్ యూనిట్ పరిధి షాపులు, బ్యాంకెట్ హాల్ లీజుకు టెండర్లు ఈనెల 25 సాయంత్రం 4 గంటల వరకు స్వీకరించనున్నట్లు టాడీ టాపర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి డీ.ఆర్.ఉదయ్ ప్రకాశ్ తెలిపారు. 26న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు బిడ్లు తెరవనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ ఆరవ అంతస్తుకి రావాలన్నారు.