NRML: నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ గోదాం ప్రాంతంలో రేపు (20-03-2026) శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భాగ్యనగర్ గోదాం, ఎన్టీఆర్ మార్గ్, ఈద్గాం చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేయబడుతుందని ఏడీఈ శ్రీనివాస్ గురువారం తెలిపారు. వినియోగదారులు ఈ అంతరానికి సహకరించాలన్నారు.