GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను గురువారం జిల్లా అవాజ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, మైనారిటీ బాలికల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో లేకపోవడంతో మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని విన్నవించారు.