AP: అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులకు పూర్తి సహాయం అందించాలని తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాలు పడటంతో తీవ్ర స్థాయిలో పంటలకు నష్టం కలగనుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.