హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నటుడు శివాజీ మాట్లాడుతూ.. గద్దర్ అవార్డు అందుకోవడం సంతోషకరమని పేర్కొన్నాడు. ప్రభుత్వాలు అవార్డులు ఇస్తే అందరికీ ప్రోత్సహకంగా ఉంటుందని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నాడు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నాడు.