హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది బ్లాక్ గోల్డ్’. యోగేష్ KMC దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం నుంచి ఉగాది కానుగా చిత్రయూనిట్ పోస్టర్ను విడుదల చేసింది. రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త యాక్షన్-ప్యాక్డ్ పోలీస్ పాత్రలో కనిపించనుంది.