»The Tiger That Killed The Cow And Ate It The Police Are Shocked At What The Farmer Did Out Of Spite
Farmer Kills Tigers: ఆవును చంపి తిన్న పులి.. పగతో రైతు చేసిన పనికి పోలీసులు షాక్
ఓ రైతు తన పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆవులు, మేకలకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తాడు. అలాంటి ఓ రైతు ఆవును పులి చంపి తినేసింది. దీంతో ఆ రైతు పగతో రగిలిపోయాడు. ఆ రైతు చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు.
ఓ రైతు పగతో పులులను చంపిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నీలగిరి జిల్లాలో శేఖర్ అనే రైతు ఉన్నాడు. తన ఇంటి వద్ద ఆవులు, మేకలను ఆయన పెంచుకునేవాడు. రెండు రోజుల క్రితం ఆ రైతు ఊరికి సమీపంలో రెండు పులులు మృతదేహాలను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ పులుల మృతిపై విచారణ చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో వారికి షాకింగ్ విషయం తెలిసింది.
పులులు పురుగుమందు తాగి చనిపోయినట్లుగా అధికారులు నిర్ధారించారు. చనిపోయిన పులుల పక్కన ఆవు కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నీలగిరి అటవీ పరిధిలో 20 మంది అధికారులు కలిసి లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ తరుణంలో అనుమానం వచ్చి శేఖర్‌ను అరెస్ట్ చేశారు. తమ స్టైల్లో విచారణ చేపట్టగా ఆ రైతు అసలు విషయం చెప్పాడు.
తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న తన ఆవును ఆ పులులు చంపి తినేశాయని, వాటి మీద పగ పెంచుకునే ఆ పనిని చేసినట్లు రైతు ఒప్పుకున్నాడు. పులులు చనిపోవడానికి విషం పెట్టినట్లు విచారణలో వివరించాడు. ఆవును చంపడంతో దానికి ప్రతీకారంగానే ఆ పనిని చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి రైతు శేఖర్‌ను అరెస్ట్ చేశారు.