JGL: కథలాపూర్ మండలం పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో 30 లక్షలతో నిర్మిస్తున్న మూడు మహిళా సమైక్య సంఘం నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సమైక్య సంఘాల బలోపేతం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు.