బిగ్‌బాస్7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌పై యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రైతు బిడ్డా అని చెప్పుకుని హౌస్ లోకి వెళ్లి అమ్మాయిలతో రొమాంటిక్ డైలాగ్స్ చెబుతున్నాడని మండిపడ్డాడు.
బిగ్‌బాస్7 షోలోకి రైతుబిడ్డగా కామన్ మ్యాన్ కేటగిరీలో పల్లవి ప్రశాంత్ ఎంటరైన సంగతి తెలిసిందే. షోలోకి స్టేజీ మీదకు ఎంట్రీ ఇవ్వడమే భుజాన ఓ బస్తా వేసుకుని వచ్చాడు. హౌస్ లోకి వెళ్లడానికి ముందు రైతుల గురించి ఎంతగానో మాట్లాడాడు. హౌస్ లోకి వెళ్లగానే అమ్మాయిలతో కబుర్లు చెప్పుకుంటూ బిజీ అయిపోయాడు. మొదట్లో హౌస్ లోకి రావడానికి ముఖ్య ఉద్దేశం రైతులకు సంబంధించి అన్ని కష్టాలను తెలియజేయడానికేనని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. మెల్లగా తాను రైతు అన్న విషయాన్ని మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా పల్లవి ప్రశాంత్ పై ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ ఓనర్ అన్వేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పల్లవి ప్రశాంత్వి అన్నీ డ్రామాలే అంటూ చెప్పుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలోకి వచ్చేందుకు ఓసారి అన్వేష్‌తో మాట్లాడారంట. తాను ఎలాగైనా బిగ్ బాస్ షోలోకి వెళ్లి పాపులర్ అవ్వాలని ప్రశాంత్ చెప్పిన మాటలకు అన్వేష్ అవాక్కయ్యాడట. ఆ షోలోకి వెళ్లడం వల్ల నీకేం వస్తుందని అన్వేష్ ప్రశ్నించడంతో తాను రైతుల గురించి అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పాడట. రైతుల గురించి అందరికీ తెలుసు కానీ ప్రత్యేకంగా నువ్వు చెప్పేదేంటి? అని అన్వేష్ ప్రశ్నించే సరికి హర్ట్ అయిన పల్లవి ప్రశాంత్..నా అన్వేషణ ఛానెల్‌ను బ్లాక్ చేశాడట.
ఆ విషయాన్ని అన్వేష్ ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్ మొహం చూస్తేనే వాడు ఎంత పెద్ద మోసగాడో అర్థమవుతోందని, రైతుల గురించి ఏవేవో చెప్తానని సింపతీతో హౌస్ లోకి వెళ్లి ఇప్పుడు అమ్మాయిలతో డైలాగులు మాట్లాడుతున్నాడని అన్వేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హౌస్‌లో జై జవాన్.. జై కిసాన్ అని అనకుండా రొమాంటిక్ డైలాగ్స్ చెబుతూ అందరి దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని అన్వేష్ మండిపడ్డాడు.