టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు, అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని అన్నాడు.