SRCK: వేములవాడ కోర్టులో ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక అని, ఈ పండుగ అందరికీ శుభం కలిగించాలన్నారు. ఏజీపీ భాను కృష్ణ, సీనియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.