TG: ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో.. జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు రూ.594 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో కీలక మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో వీటి నిర్మాణం చేయనున్నారు.