BDK: ఉగాది పండుగను పురస్కరించుకుని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వారు ఉగాది పచ్చడిని కాంగ్రెస్ నాయకులకు పంచారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.