MBNR: జిల్లా కోర్టులో ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడదగ్గ కేసులను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని,”రాజీ మార్గమే రాజమార్గం” అని ఆమె పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 1,334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కరించామని వెల్లడించారు. సివిల్, కుటుంబ కలహాలు, ప్రమాద బీమా వంటి కేసులు పరిష్కరిస్తామన్నారు.