NTR: కంచికచర్ల మండలం అరుంధతి కాలనీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 31న వీరులపాడు మండలం వి.అన్నవరంలో జరగనున్న మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. “హలో మాదిగ-చలో వి.అన్నవరం” పేరిట రూపొందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు.