అనంతపురం రెవెన్యూ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.